బాబు దత్తతలో హెచ్ఐవి బాధిత పాప
కడప: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విశేషమైన ఉదారత ప్రదర్శించారు. ఆయన హెచ్ఐవి బాధిత పాపను దత్తత తీసుకున్నారు. కడప జిల్లాలో మీ కోసం యాత్ర సాగిస్తున్న ఆయన గురువారం ఆ మేరకు ఒక ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆయన తన యాత్రలో తీవ్రంగా ధ్వజమెత్తారు.
ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే రాష్ట్రంలో కరెంట్ కష్టాలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. చిన్న వర్షాలకే సాగునీటి ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని, నీటి పారుదల శాఖ నిర్వీర్యం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 550 మంది చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications