నందినికి పవన్ రు. 5 కోట్లు

Pawan Kalyan throws divorce
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ పెళ్ళి వివాదం ఐదు కోట్ల నష్ట పరిహారంతో ముగిసిపోయింది. పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందినికి 5 కోట్ల నష్టపరిహారం ఇచ్చి కోర్టు వెలుపల పరిష్కారం కుదుర్చుకున్నారు. ఈనెల 15 లేదా 16 తేదీల్లో రాజీ పిటిషన్ దాఖలు చేయాలని ఒప్పందం కుదిరింది.

పవన్ కళ్యాణ్- నందినిల మధ్య కొంతకాలంగా న్యాయస్ధానాల్లో కేసులు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవితో పాటు మరో 12 మందిని ఆమె ప్రతివాదులుగా పేర్కొన్నారు. పవన్- నందినిలకు 1997 మార్చిలో పెళ్ళి జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలను నందిని కోర్టుకు సమర్పించింది. కొద్ది కాలానికే వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. కొంతకాలం న్యాయస్ధానాల్లో విచారణలు జరిగిన తర్వాత తనకు 8 కోట్ల పరిహారం ఇవ్వాలని నందిని డిమాండ్ చేసింది. ఇరువైపులా ఉన్న న్యాయవాదులు 5 కోట్లకు కోర్టు వెలుపల పరిష్కారానికి రాజీ కుదిర్చినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+