దావూద్ సోదరుడు అనీస్ అరెస్టు
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహిం సోదరుడు అనీస్ ఇబ్రాహింను సౌదీ అరేబియాలోని జెడ్డాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ పాస్ పోర్టుతో ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అనీస్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అనీస్ ను అదుపులోకి తీసుకున్నారనే వార్తలు రావడంతో జెడ్డాలోని భారత రాయబార కార్యాలయాన్ని, నగరంలోని ఇంటర్ పోల్ ను అప్రమత్తం చేశారు.
1993లో జరిగిన ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో అనీస్ ఇబ్రాహీం ప్రధాన అనుమానితుడు. ముంబయి బాంబు పేలుళ్లకు జరిగిన కుట్రలో అతను పాల్గొన్నాడు. అలాగే ముంబయికి ఎకె -56కు చెందిన చిన్నపాటి ఆయుధాలను, గ్రెనేడ్లను ముంబయి చేర్చడానికి ఏర్పాట్లు చేశాడు.












Click it and Unblock the Notifications
