ఇమేజ్ పనికి రాదు: చిరుపై కెకె
హైదరాబాద్: రాజకీయాలకు సినీ గ్లామర్ పనికి రాదని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కె. కేశవరావు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై అన్నారు. చిరంజీవి మంచి ఇమేజ్ ఉన్న నటుడని, అయితే రాజకీయాలకు అదొక్కటే సరిపోదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చిరంజీవి పార్టీ విధివిధానాలు చూసిన తర్వాతనే తానేమైనా మాట్లాడుతానని ఆయన అన్నారు.
రాజకీయాలు, సినీ గ్లామర్ రెండు వేర్వేరని, సినీ ఇమేజ్ వల్ల రాజకీయాల్లో రాణిస్తారని అనుకోలేమని ఆయన అన్నారు. దేశంలో చరిష్మాకు సంబంధించి ఇందిరా గాంధీని మించిన వారు లేరని, ఆమె ఇమేజ్ మాత్రమే కాంగ్రెసుకు ఓట్లను తెచ్చిపెట్టలేదని, గరీబీ హటావో నినాదం ఇందిరాగాంధీకి అధికారాన్ని కట్టబెట్టిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
