చిరంజీవిపై విమర్శలా: కోటగిరి
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలు కాంగ్రెసు దిగజారుడుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కోటగిరి విద్యాధరరావు చిరంజీవి పార్టీలో చేరడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. చిరంజీవి పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. చిరంజీవి తిరుపతి సభకు ప్రజలు స్వచ్ఛందంగానే తరలి వస్తారని ఆయన చెప్పారు.
వెనకబడిన తరగతుల ప్రజలు తెలుగుదేశం పార్టీతో లేరని ఆయన అన్నారు. సిద్ధాంతాలను పక్కన పెట్టి మహాకూటమి ఏర్పాటు చేయడం అవకాశవాద రాజకీయమని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
