ఎమ్మెల్యే రంగరాజుపై అరెస్టు వారంట్
విశాఖపట్నం: విశాఖ - 2 శాసనసభ్యుడు రంగరాజుపై విశాఖ సిఎంఎం కోర్టు గురువారం అరెస్టు వారంట్ జారీ చేసింది. 2004లో జరిగిన ఒక ఘర్షణకు సంబంధించిన కేసులో కోర్టు ఈ వారంట్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు హర్షకుమార్ కు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘర్షణకు సంబంధించి కేసు నమోదైంది. రంగరాజుపై కూడా ఆ సందర్భంగా కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో రంగరాజుపై వారంట్ జారీ అయింది. ఆ కేసు విషయం తనకు తెలియనే తెలియదని రంగరాజు అంటున్నారు. దీనిపై తాను రీకాల్ పిటిషన్ వేస్తానని ఆయన చెప్పారు. రంగరాజు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
