బాంబుపేలుళ్ళ సూత్రధారి హైదరాబాద్ వాసి
అహ్మదాబాద్: అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళ ప్రధాన సూత్రధారి హైదరాబాద్ వాసి అయిన అబ్దుల్ బషీర్ అని గుజరాత్ డిజిపి శనివారం ఇక్కడ మీడియా ప్రతినిధులకు చెప్పారు. దర్యాప్తు పూర్తయిందని తొమ్మిది మందిని అరెస్టు చేశామని, బషీర్ కు సంబంధించిన మరికొంత సమాచారం హైదరాబాద్ నుంచి అందవలసి ఉందని చెప్పారు. వరుస బాంబు పేలుళ్ళ కారణంగా అహ్మదా బాద్ నగరంలో 55 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
సిటీ క్రైమ్ బ్రాంచ్ ఇచ్చిన సమాచారం మేరకు వీరిని అరెస్టు చేశామన్నారు. పేలుళ్ళతో సంబంధముందని అబ్దుల్ ను గతంలో పోలీసులు అరెస్టు చేశారని, ప్రస్తుతం అతడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని చెప్పారు.












Click it and Unblock the Notifications
