నన్ను చంపడమే ఇక మిగిలింది: కె ఎ పాల్
విజయవాడ: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రమేయంతో అధికారులు తనను మానసికంగా హింసిస్తున్నారని క్రైస్తవ మత ప్రచారకుడు కె ఎ పాల్ ఆరోపించారు. తనను చంపడం తప్ప చేయాల్సిందంతా చేశారని ఆయన విజయవాడలో శనివారం అన్నారు. తాను తలపెట్టిన సభలను ఇప్పటికి ఎనిమిది సార్లు వివిధ కారణాలతో అడ్డుకున్నారని, తన వాహనాలను సీజ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సభ కోసం విజయవాడలో ఒక హోటల్ లో దిగితే స్ధానిక సీఐ వచ్చి రసీదును చింపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా పాల్ హోట ల్ ఎదుట ధర్నా చేశారు.












Click it and Unblock the Notifications
