ఆయేషా కేసులో నందిగామ సిఐ సస్పెన్షన్
విజయవాడ: అయేషా హత్య సరిగా విచారణ జరుపకుండా కేసును తప్పుదోవ పట్టించిన నందిగామ ఎస్సై, సీఐలను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. ఈ కేసులో నేరం ఒప్పుకున్న సత్యం బాబుది నందిగామ మండలమే. సెల్ ఫోన్ల దొంగతనం కేసులో అరెస్ట్ అయి ఆరు నెలలు జైలులో ఉన్న సత్యం బయటికి వచ్చిన వెంటనే నందిగామ పాలిటెక్నిక్ హాస్టల్ లో బాలికలపై దాడికి యత్నించాడు. వారు కేకలు వేయడంతో గోడ దూకి పారిపోయాడు. ఈ క్రమంలో చెప్పును అక్కడే విడిచాడు. గాజు పెంకులు గుచ్చుకోవడంతో కాలు నుంచి రక్తం కారింది. వీటి ఆధారంగా డిఎస్పీ శ్రీనివాస్ ను స్వయంగా విచారించి, అతడిని నిందితుడిగా తేల్చారు. గతంలో ఈ కేసును విచారించిన ఎస్ ఐ రామకోటేశ్వరరావు, సీఐ రాజేంద్రప్రసాద్ ఇతరులను నిందితులుగా పేర్కొన్నారు. కేసును సరిగా దర్యాప్తు చేయనందుకు వీరిపై సస్పెన్షన్ వేటు పడనుంది












Click it and Unblock the Notifications
