టిడిపి రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి పార్టీలోకి
తిరుపతి: తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ వి ప్రసాద్ టిడిపికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చిరంజీవి పెట్టబోయే పార్టీలో చేరనున్నట్టు ఆయన చెప్పారు.
కోటగిరి విద్యాధరరావు వంటి సీనియర్ టిడిపి నాయకులు ఇప్పటికే చిరు శిబిరంలో చేరిపోయారు. మరో ప్రముఖ నాయకుడు ఆదికేశవులు నాయుడు కూడా చిరంజీవి పార్టీలో చేరే అవకాశముంది. దీనితో చంద్రబాబు నాయుడు కొందరు నాయకుల కదలికలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
