చంద్రగ్రహణం: నేడు ఆలయాల మూసివేత
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయాలన్నీ నేడు చంద్ర గ్రహణం సందర్భంగా మూతపడనున్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో దేవాలయాలు తెరిచి ఉండకూడదు. గ్రహణం విడిచిన కొన్ని గంటల తర్వాత సంప్రోక్షణ తదితర ప్రక్రియల తర్వాత ఆలయాన్ని భక్తుల కోసం తెరచి ఉంచాలి.
తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని రాత్రి 7.30 వరకు మూసివేసి రేపు ఉదయం 5 గంటలకు తెరుస్తారు. విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సాయంత్రం 5 గంటలకు మూసివేసి ఉదయం 8 గంటలకు తెరుస్తారు. శ్రీశైలంలో సాయంత్రం 4.14 నుంచి మూసివేసి, ఉదయం 7 గంటలకు తెరుస్తారు. అన్నవరం, అహోబిలం, మహానందిలో సాయంత్రం 5 గంటలకు మూసివేసి రెపు ఉదయం ఏడు గంటలకు తెరుస్తారు. గ్రహణ ప్రభావం ఒక్క శ్రీకాళహస్తి ఆలయం మీద మాత్రమే ఉండదు. ఆ ఆలయం తెరిచే ఉంటుంది.












Click it and Unblock the Notifications
