ముంబయి: శిల్పా శెట్టి తండ్రి కూతుళ్లకు కొన్ని నియమాలు పెట్టారు. శిల్పా శెట్టి సోదరి సమితి శెట్టికి ఆయన కొన్ని సూచనలు చేశాడు. ఇవే సూచనలు శిల్పా శెట్టికి కూడా వర్తిస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి రాకూడదని, ఈ విషయాల్లో సమయం పాటించాలని ఆయన తన కూతుళ్లకు ఆంక్షలు పెట్టారు. పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇష్టం గానీ అంతవరకు తాను చెప్పినట్లు వినాలని ఆయన వారికి చెప్పారట. ఇంటికి రాత్రి ఆలస్యంగా వస్తే ఊరుకోనని ఆయన చెప్పారని శిల్పా శెట్టి అంటోంది.
తండ్రి మాట వినాలని ఆ సోదరీమణులు నిర్ణయించుకున్నారు. తండ్రిని బాధ పెట్టడం వారికి ఇష్టం లేదట. తమ ఇంటికి బిగ్ బాస్ ఆయనేనని, అయనను తాము విపరీతంగా ప్రేమిస్తామని, అందువల్ల ఆయనను బాధపెట్ట దలుచుకోలేదని వారు చెప్పారు.