న్యూడిల్లీ:యూఎన్ ఓపెన్ టెన్నీస్-08 నుండి భారత్ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా వైతొలిగింది. మణికట్టుకు తీవ్ర గాయం కావటంతో పోటీ నుండి చివర నిముషంలో విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కారణంతో బీజింగ్ ఒలింపిక్స్ నుండి కూడా సానియా తప్పుకుంది. యూఎస్ ఓపెన్ కోసం సానియా చాలా కాలం నుంచీ శిక్షణ పొందుతోంది. అయితే గాయాల వల్ల పలు టోర్నీల నుండి అర్ధాంతరంగా తప్పుకోవటంతో డబ్లుటీఏ ర్యాంకింగ్స్ లో సానియా ర్యాంకు పడిపోయింది.