హైదరాబాద్: "మీ కోసం" చైతన్య యాత్రను పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీ వ్యూహాల మీద దృష్టి సారించారు. రాష్ట్రం లో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంతో కొత్త పొత్తులతో రాష్ట్ర రాజకీయం మారిపోయింది. ఈ నేపధ్యంలో జాతీయ స్ధాయిలో తృతీయ ఫ్రంట్ పార్టీల నాయకులతో చర్చలు జరపడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. సిపిఎం అగ్రనాయకుడు ప్రకాష్ కారత్, సిపిఐ నాయకుడు బర్దన్, బిఎస్ పి అధినేత్రి మాయావతితో ఆయన చర్చలు జరుపనున్నారు.