హైదరాబాద్: "చిరంజీవి లేడు..బొచ్చు గాడు మమ్మల్నేమీ చేయలేడు...వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే" ఇవీ కాంగ్రేస్ సీనియర్ నాయకుడు ఎమ్మల్సీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎవరు ఎన్ని పార్టీలు పెట్టినా వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేసినా కాంగ్రేస్ ని ఓడించలేరని ఆయన ధీమా వ్యక్తం చేసారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయ ఆవరణలో పాల్వాయి విలేఖరులతో ఆయన ముచ్చటించారు. చిరంజీవి ప్రభావం తమపై ఏ మాత్రం ఉండదని పాల్వాయి ధీమాగా చెప్పారు.