షరతులను భారత్ అంగీకరించదు: ప్రణబ్ ముఖర్జీ

భారత్‌కు ఎన్ఎస్‌జీ దేశాలు ఎటువంటి షరతులు ప్రతిపాదించాయో చూడలేదు. వాటిని తెలుసుకున్న అనంతరం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. అణు సరఫరా గ్రూపు సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలను విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ తన దృష్టికి తెచ్చారని ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు.
అంతకుముందు వియన్నాలో రెండు రోజులపాటు జరిగిన కీలక అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జీ) దేశాల సమావేశం నిర్మాణాత్మంగా, ఉపయోగకరంగా సాగిందని ఈ సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ తెలిపారు. ఇతర దేశాలతో అణు వాణిజ్యం జరుపుకునేందుకు తమపై విధించిన నిషేధాన్ని తొలగించాలని భారత్ ఈ సమావేశంలో ఎన్ఎస్‌జీ దేశాలను కోరిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications