రతన్ టాటాకు ఒరిస్సా,మహారాష్ట్ర ఆహ్వానం
ముంబయి: సింగూరులోని చిన్న కార్ల ఫాక్టరీని తరలించాలని టాటాలు నిర్ణయిస్తే తమ రాష్ట్రం వారికి ఆహ్వానం పలుకుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావు దేశముఖ్ అన్నారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము చూస్తామన్నారు. గతంలో వీడియోకాన్ సంస్ధ మహారాష్ట్రలో ఎల్ సీ డీ ల ఉత్పత్తి ఫ్లాంట్ కు అనుమతి కోరగా ఆ ప్రభుత్వం నిరాకరించింది. వారికి బెంగాళ్ ప్రభుత్వం అనుమతించింది. అందుకు ప్రతిగా ఈ సారి మహారాష్ట్ర టాటాలకు ఆహ్వానం పలుకుతోంది. మరోవైపు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తమ రాష్ట్రంలో కార్ల ప్రాజెక్టుకు అన్ని వసతలు ఉన్నాయని తమ దగ్గర ప్రాజెక్టు పెడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని టాటాలకు ఆహ్వానం పలికారు.












Click it and Unblock the Notifications