హైదరాబాద్ పేలుళ్లకు ఏడాది

ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల నిందితుడు అబూ బషీర్ పాత్ర ఈ పేలుళ్లలో ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. బషీర్ హైదరాబాదులోనే చదువుకున్నట్లు, ఇక్కడి మదర్సాలో టీచరుగా పనిచేసినట్లు వార్తలు రావడంతో హైదరాబాద్ పేలుళ్లలో అతని పాత్ర ముందుకు వచ్చింది. హైదరాబాదు బాంబు పేలుళ్లలో పోలీసులు 98 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో 26 మందిని పేలుళ్లతో సంబంధం లేదని విడిచిపెట్టారు. మిగతా వాళ్లలో కొంత మంది బెయిల్ పై విడుదలయ్యారు. దేశంలో ఎక్కడ పేలుళ్లు సంభవించినా హైదరాబాద్ ప్రధానంగా వార్తల్లోకి వస్తోంది. ఇతర రాష్ట్రాల పోలీసులు హైదరాబాదు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్ పేలుళ్లు సంభవించిన 20 రోజుల్లో అక్కడి పోలీసులు బషీర్ ను అరెస్టు చేశారు. కానీ హైదరాబాద్ పేలుళ్ల విషయంలో మాత్రం ఇక్కడి పోలీసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. రాజకీయ జోక్యం కూడా దీనికి ప్రధాన కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
