శిబూ సొరేన్ కు మధు కొడా మద్దతు
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి కావడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) నేత శిబూ సొరేన్ కు అడ్డంకులు తొలగిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి మధు కొడా, స్వతంత్ర సభ్యుడు స్టీఫెన్ మారండీ సొరేన్ కు మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో సొరేన్ కు ముఖ్యమంత్రి కావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ జోక్యంతో ఈ ఇద్దరు నాయకులు సోరేన్ కు మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. లాలూ సలహా మేరకు సొరేన్ కు మద్దతిస్తూ మీడియా ముందు కొడా, మారండీ లేఖలు అందజేశారు.
దీంతో శిబూ సొరేన్ గవర్నర్ రజీని కలిసి తనకు మద్దతిస్తున్న 42 మంది సభ్యుల జాబితాను అందజేశారు. లాలూ, గురువు (సొరేన్) తన ఇంటికి వచ్చారని, సంప్రదాయం ప్రకారం అతిథి దేవోభవ అని భావించి వారి కోరికను మన్నించానని, యుపిఎ ఐక్యతను దృష్టిలో పెట్టుకుని కూడి మద్దతుకు అంగీకరించానని కొడా చెప్పారు.












Click it and Unblock the Notifications
