ఆయన ఆస్తులు రు.50 కోట్లపైనే!
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా భూసేకరణ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ రాంగోపాలరావు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. రాంగోపాల్ రావుకు హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల ఆస్తులు ఉన్నట్లు ఎసిపి అధికారులు తమ దాడుల్లో గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు.
శంషాబాద్‌లో 50 ఎకరాలు, షేక్‌పేటలో 23 ఎకరాలు, తూంకుంటలో 12 ఎకరాలు, మరికొన్నిచోట్ల స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో రెండు ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మీద ఆయనకు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు వున్నాయని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications