బలరాం సస్పెన్షన్ ఏకపక్షం: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యుడు కరణం బలరాంను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. సభా హక్కుల సంఘానికి చెందిన కాంగ్రెస్ సభ్యులు మాత్రమే కరణం బలరాం సస్పెన్షన్ కు సిఫారసు చేశారని, మిగతా సభ్యులు కావాలంటే ఆరు రోజులో, పది రోజులో సస్పెండ్ చేయాలని సూచించారని ఆయన అన్నారు. మెజారిటీ ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, కానీ సభను నడపడానికి కొన్ని నియమాలు ఉంటాయని ఆయన అన్నారు. కరణం బలరాం సభా హక్కుల సంఘం సభ్యుడు కూడా అని, అటువంటి సభ్యుడికే సంఘం ముందు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు.

కమిటీకి అందిన సిడిల్లో వైరుధ్యాలున్నాయని ఆయన అన్నారు. కరణం బలరాం సస్పెన్షన్ రాజకీయపరమైందని, రాజకీయంగానే ఎదుర్కుంటామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇవి దుర్దినాలు అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విషయంలోనూ నీతిమాలిన చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన అన్నారు. తాము సస్పెండ్ చేసిన వ్యక్తిని టిటిడి చైర్మన్ చేశారని, దేవుడ్నే తాకట్టు పెట్టారని ఆయన అన్నారు. ఏదైనా చేసి అధికారాన్ని కాపాడుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన అన్నారు. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి, చీఫ్ విప్ స్పీకర్ ను నియంత్రిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+