చిరు పార్టీ పేరు ప్రజారాజ్యం

పార్టీ విధివిధానాలను తాను ఒక్కడిని పూర్తి స్థాయిలో ప్రకటించేది కాదని, సమిష్టి నిర్ణయంతో జరగాల్సిన విషయమని, పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని, లౌకిక విధానం పార్టీకి ఉంటుందని ఆయన అన్నారు. కర్షకులకార్మికుల, అన్ని వర్గాలకు చెందిన పార్టీ అని ఆయన అన్నారు. ఆధునిక విధానాలను, పారిశ్రామికీకరణ ప్రోత్సహించే పార్టీ అని ఆయన అన్నారు. ఇది ఇప్పుడే పుట్టిన పార్టీ అని, ప్రజల గుండెల నుంచి పుట్టిన పార్టీ అని ఆయన అన్నారు. తన మిషన్ ఇలా ఉండాలనే తన కోరికను తెలియజేసుకుంటానని ఆయన చెప్పారు.
సంతోషాంధ్రప్రదేశ్ ను, చిరునవ్వుల ఆంధ్రప్రదేశ్ ను సృష్టించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరులకు కొదవ లేదని ఆయన అన్నారు. శ్రామిక శక్తి పుష్కలంగా ఉందని, ప్రణాళికలను అమలు చేయడంలో లోపాలున్నాయని ఆయన అన్నారు. ఆ లోపాలను సరిదిద్దాలని ఆయన అన్నారు. అలా చేసినప్పుడు మనది ఏ దేశానికి తీసిపోదని ఆయన అన్నారు. మీ మీద నమ్మకంతో బ్లడ్ బ్యాంక్ పెట్టానని, దాన్ని విజయవంతం చేశారని ఆయన అన్నారు. సమిష్టి కృషే మన బలమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications