చిరుకు రెండో వైపు ఉంది: చిరు

Chiranjeevi
తిరుపతి: తమ కష్టాల్లో పాలు పంచుకోవాలని ప్రజలు కదిలి రా అని పిలుపునిచ్చారని, తెలుగు ప్రజలు 30 ఏళ్లు గుండెల్లో పెట్టుకుని పెంచి పోషించారని చిరంజీవి అన్నారు. మంగళవారం సాయంత్రం సరిగ్గా ఐదున్నర గంటలకు వేదికపై వచ్చి వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. వెంటనే తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వేంకటస్వామివారి సాక్షిగా భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి సమాయత్తమైందని, ఈ జన ప్రభంజనాన్ని చూసి తన జీవితం ధన్యమైందని ఆయన అన్నారు. యావత్తు తెలుగు జాతి వేంకటేశ్వరస్వామి పాదాల చెంత కొలువై ఉందని ఆయన అన్నారు. ఈ జన ప్రభంజనాన్ని చూస్తుంటే ఏమైనా సాధించగలననే నమ్మకం కలుగుతోందని ఆయన అన్నారు.

సేవా కార్యాక్రమాలు విస్తృతం చేయడానికి ముందుకు వచ్చానని ఆయన అన్నారు. ప్రజాసేవ చేయడానికి సమాయత్తం అయ్యే నాటికి తండ్రి లేకపోవడం లోటుగా ఉందని, అయితే తండ్రి ఆశీస్సులు తనకు ఉంటాయని ఆయన అన్నారు. మదర్ థెరిస్సా పుట్టిన రోజున మన పార్టీని ఆవిష్కరించుకుంటున్నామని ఆయన చెప్పారు. వ్యక్తిగత జీవితంలో సుఖసంతోషాలతో జీవించడానికి చాలినంత ఉందని, అయితే తనను గుండెలో పెట్టుకుని పోషించిన ప్రజలకు విస్తృత సేవలు చేయాల్సిన అవసరం ఉందని భావించానని ఆయన అన్నారు. ఇప్పటి వరకు నాణేనికి ఒక వేపున ఉన్న చిరంజీవినే చూశారని, చిరంజీవికి కష్టాలు ఏం తెలుసు రాజకీయాలు ఏం తెలుసు అని అనేవారున్నారని, అయితే నాణేనికి ఆవలి వైపు ఉన్న చిరంజీవి గురించి ఇప్పటి తాను ఆవిష్కరించలేదని ఆయన అన్నారు. ఒక చిరు ఉద్యోగి కొడుకు మీరు పెంచి పోషించిన చిరంజీవి అయ్యాడని ఆయన అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఆయన చెప్పుకొచ్చారు. తన కుటుంబ జీవితం ఎంత సాదాసీదాగా సాగిందో, తాను ఎంత కష్టపడ్డాడో ఆయన వివరించారు. తన ఆర్థిక ఇబ్బందులను వివరించారు. తాను కట్టె పుల్లలు మోసుకొచ్చిన వైనాన్ని తెలిపారు. తన తల్లి పడిన కష్టాలను వివరించారు. పోలీసు కానిస్టేబుల్ తండ్రి బదిలీల కష్టాలను వివరించారు. తిండి దొరకని పరిస్థితులను చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+