శివాజీతో చిరంజీవి చర్చలు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు యలమంచిలి శివాజీతో మంగళవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడాల్సిన విషయాలపై ఆయన శివాజీతో చర్చిస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఆయన జాపాలి వద్ద చేయతలపెట్టిన ప్రత్యేక పూజలను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
చిరంజీవి మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి కారులో చేరుకున్నారు. సభ తర్వాతే ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం ఉంది. అనంతరం జాపాలి వెళ్లి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంది. అయితే యలమంచిలి శివాజీతో మాట్లాడడానికి ఆయన దాన్ని రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications