కీలకాంశాలపై తేల్చని చిరంజీవి

తాను ప్రకటించే విధానాలు సంపూర్ణం కాకపోయినా తన అభిప్రాయాలను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అలా చెప్పి ఆయన శ్రీశ్రీ రాసిన కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం.. సమస్త వృత్తుల సమస్త చిహ్నాలు అనే కవితను చదివి బడుగు బలహీనవర్గాల పక్షాన తన పార్టీ ఉంటుందని చెప్పారు. రైతుల దుస్థితి గురించి వివరించి వారి మేలు కోసం తమ పార్టీ కృషి చేస్తానని ఆయన చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో లోపాల గురించి ఆయన వివరించారు. విద్యారంగానికి ఇచ్చే ప్రాధాన్యం గురించి ఆయన వివరించారు. మధ్యతరగతికి తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. కిలో రెండు రూపాయలు పొందలేరు, 25 రూపాయలు పెట్టి కొనలేరు, విచిత్రమైన వర్గమని ఆయన అన్నారు. ఆ వర్గం బాగు కోసం పని చేస్తామని ఆయన అన్నారు. మహిళా సాధికారితకు పెద్ద పీట వేద్దామని ఆయన చెప్పారు. కార్మికులకు జరిగే అన్యాయాన్ని రూపుమాపుదామని ఆయన అన్నారు. యువశక్తికి తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. యువశక్తి సామర్థ్యాన్ని వాడుకుంటామని ఆయన చెప్పారు. సమాజంలోని వివిధ వర్గాల గురించి ఆయన వివరిస్తూ వారికి తమ పార్టీ చేసే మేలును ఆయన చెబుతూ పోయారు. సమ సమాజ స్థాపనే తమ ధ్యేయమని ఆయన అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు. పట్టణాలకు, గ్రామాలకు మధ్య పెరుగుతున్న వ్యత్యాసాన్ని ఆయన విమర్శించారు. బాలకార్మికుల వ్యవస్థను నిర్మూలిద్దామని ఆయన అన్నారు.
ప్రభుత్వం ప్రజలకు కనీస వసతులు కల్పించడం బాధ్యత అని, అవి పొందడం మన హక్కు అని, అవి మనమే చేసుకుందామని ఆయన అన్నారు. అవినీతి వ్యవస్థీకృతమైందని, దీన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని, రాజకీయాలను ప్రక్షాళన చేస్తే అవినీతి అరికట్టడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఆకలి, ఆశ, అత్యాశ ఈ మూడు అవినీతికి మూలమని, అత్యాశ చాలా ప్రమాదకరమని, జాతికే అరిష్టమని ఆయన అన్నారు. ప్రాజెక్టులను స్వాగతిస్తామని, అయితే అవినీతి కోసమ చేపట్టే పథకాలను వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. మద్యం మత్తు కుటుంబాలను చిత్తు చేస్తోందని ఆయన అన్నారు. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకునేందుకు మార్గం మద్యం అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications