తెలంగాణ సెంటిమెంట్ ను గుర్తిసాం: చిరు
తిరుపతి: తెలంగాణ కోటి సమస్యల కోనగా ఉందని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి అన్నారు. సాగునీటి పంపకంలో అన్యాయం జరిగిందనే అభిప్రాయం ఉందని, పాలకుల వివక్షే దీనికి కారణమని ఆయన అన్నారు. అభివృద్ధి సమస్య అని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిద్దామని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుదామని ఆయన అన్నారు. కోస్తాలోనూ, రాయలసీమలోనూ వెనకబడిన ప్రాంతాలున్నాయని, వెనకబడిన ప్రాంతాలకోసం చిత్తశుద్ధితో పని చేస్తామని ఆయన చెప్పారు. తెలంగామ సమస్యలతో, అణచివేతతో సతమతవుతోందని ఆయన అన్నారు. తెలంగాణలో పోరాట స్ఫూర్తి ఉందని ఆయన అన్నారు. విశేషమైన మానవ వనరులు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు పంట భూములను తీసుకునే విధానానికి స్వస్తి చెప్తామని ఆయన అన్నారు. పారిశ్రామిక అభివృద్ధిని కోరుకుంటామని, అయితే రైతులకు అన్యాయం చేసే పద్ధతులకు స్వస్తి పలకాలని ఆయన అన్నారు. ఇబిసిలను గుర్తిస్తామని ఆయన చెప్పారు. పేదలకు సాయం చేస్తామని ఆయన చెప్పారు.
వికలాంగుల చేత ఆయన తన పార్టీ జెండాను ఆవిష్కరింపజేశారు. పైన తెలుపు, కింద ఆకుపచ్చ రంగుల జెండాపై తెలుపు రంగులో సూర్యుడి చిహ్నం ఉంది. పైన తెలుపు, కింద ఆకుపచ్చ రంగుల జెండాపై తెలుపు రంగులో సూర్యుడి చిహ్నం ఉంది. పచ్చిని పొలాల్లో ఉండి చూస్తే సూర్యుడు కనిపిస్తాడని ఆయన అన్నారు. ప్రతిదానికీ సూర్యుడు శక్తి ప్రదాత అని ఆయన అన్నారు. సూర్యుడు చుట్టూ 24 కిరణాలు, రోజుకు 24 గంటలు, ఈ 24 గంటలు మనందరం ప్రజల్లోకి తీసికెళ్తామని ఆయన వివరణ ఇచ్చారు. సూర్యుడి ఎరుపు విప్లవానికి, మార్పునకు చిహ్నమని, తెలుపు ఎన్నో వర్ణాల మిళితం, అందరిదీ అది, అన్ని వర్గాల వారిది అని, స్వచ్ఛతకు, పారదర్శకతకు చిహ్నమని, పచ్చదనం సస్యశ్యామలానికి ప్రతీక అని ఆయన వివరించారు. అన్ని మతాలకు ప్రతీకగా కూడా జెండా రంగులున్నాయని ఆయన అన్నారు. పార్టీ టీం సాంగ్ ను కూడా ఆయన వినిపించారు.












Click it and Unblock the Notifications