చిరు తొలి రాజకీయ బహిరంగ సభ నేడే

ఈ నెల 17న రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్టు చిరు ప్రకటించినా, పార్టీకి సంబంధించిన వివరాలను మాత్రం బహిరంగ సభలోనే వెల్లడించనున్నామని చెప్పడంతో అందరి దృష్టి సభపైపడింది. డిజిటల్ ఎక్విప్‌మెంట్ సాయంతో ఆకర్షణీయమైన రీతిలో వేదికపై పార్టీ వివరాలను ఆవిష్కరించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
పార్టీ జెండాను కూడా వేదికపై ఆవిష్కరించనున్నట్టు చిరు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సభలో చిరు తన బాల్యం, సినీ కేరీర్, రాజకీయ ప్రవేశానికి దారి తీసిన పరిణామాలను వివరించనున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications