ప్రసంగ పాఠంపై చిరు కసరత్తు

Chiranjeevi
తిరుపతి: మెగాస్టార్ చిరంజీవి తిరుపతిలో మంగళవారం ఉదయం పది గంటల వరకు కుటుంబ సభ్యులతో గడిపారు. ఆ తర్వాత ఆయన తర్వాత వేదికపై చేయబోయే ప్రసంగ పాఠంపై కసరత్తు చేశారు. ఈ సమయంలో ఆయనతో గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన యలమంచిలి శివాజీ చర్చలు జరిపారు. మధ్యాహ్నం సినీ రచయిత భారవి ఆయనను కలుసుకున్నారు. చిరంజీవి తన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజలతో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు సాయంత్రం నాలుగు గంటలకే వేదిక వద్దకు చేరుకున్నారు. సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్, బావమరిది అల్లు అరవింద్ వేదిక వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించడంలో నిమగ్నమయ్యారు.

ఇదిలా పుంటే, వేదిక వద్ద తొలుత అభిమానుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. అనంతరం బారికేడ్లను తోసుకుని అభిమానులు వేదిక వైపు దూసుకురావడానికి ప్రయత్నించారు. పోలీసులు, వాలంటీర్లు వారిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. వేదికపై నుంచి చిరంజీవి సోదరుడు అభిమానులకు సూచనలు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గాయకుడు మనో, ఇతరులు సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+