చిరు వేదిక వద్ద 'ఠాగూర్' ప్రదర్శన

గంటల తరబడి కూర్చుని బోరు కొట్టకుండా సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై ఠాగూర్ సినిమా ప్రదర్శిస్తున్నారు. చిరు సినిమాల్లో రాజకీయాలపై ఆయన మాట్లాడిన మాటల క్లిప్పింగులు ప్రదర్శిస్తున్నారు. చిరు వచ్చేముందు ఆయన జీవితంలోని ముఖ్య మలుపులతో డాక్యుమెంటరీని కూడా ప్రదర్శిస్తారు. తిరుపతి చేరుకున్న చిరంజీవి టి.సుబ్బిరామిరెడ్డి అతిథిగృహంలో బస చేశారు. నాలుగున్నర ప్రాంతంలో ఆయన తిరుపతి సభావేదిక చేరుకునే అవకాశం ఉంది. చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాను కూడా ప్రదర్శించారు. సభా ప్రాంగణంలో డిజిటల్ స్క్రీన్ పై ఈ సినిమాను ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications