రజనీకాంత్ ఉన్నారు కదా: చిరు

1999లోనూ, 2004కు ముందు తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రచారం సాగిందని, అయితే ఆ సమయంలో తాను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని, రావాలని కూడా అనుకోలేదని ఆయన అన్నారు. రాజకీయాల ద్వారా ఎక్కువ సేవ చేయవచ్చునని, సేవకు రాజకీయం ప్రజా సేవకు పెద్ద పనిముట్టు అని ఆయన అన్నారు. మనల్ని మనం ఎలివేట్ చేసుకోవడానికి ఇతరులను విమర్శించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విమర్శలకు ప్రతిస్పందనలు శృతి మించి ఉండకూడదని, విమర్శలకు సరైన సమాధానం చెప్పాల్సిన రీతిలో చెప్పాలని ఆయన అన్నారు. ఎక్కువ మంది ఉన్నవారికి అవకాశాలు తక్కువ ఉన్నాయని, తక్కువ మంది ఉన్నవారికి ఎక్కువ అవకాశాలున్నాయని, అందువల్ల సామాజిక న్యాయం జరగలేదనే అనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రజల ఆదరణే తన ఆస్తి, శక్తి అని ఆయన అన్నారు. సీనియర్లు కావాలి, యువకులు కావాలి, ఇందులో సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తన వద్దకు వచ్చినవారు పదునైన ఆయుధాలేనని ఆయన అన్నారు.
అవినీతిపై, తెలంగాణపై తాను లక్షలాది మంది ప్రజల ముందు చెప్తానని ఆయన అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు చంద్రబాబుకు, వైయస్ రాజశేఖర రెడ్డికి మార్కులు వేయడానికి తానెవరని ఆయన అడిగారు. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడబోనని, ఇంకా ఆ సమయం రాలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications