హైదరాబాదులో భారీ వర్షం
{image-heavy rains_26082008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాదులోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. తెల్లవారుజామున దాదాపు 4 గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఉదయం 8 గంటల దాకా కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఉదయం పూట ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం 11గంటల ప్రాంతంలో గానీ ట్రాఫిక్ అంతరాయాలు తొలగలేదు.
కోస్తా తీరంలో హైప్రెషర్ ఏర్పడడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు సమీపంలో గల బతుకమ్మ వాగు పొంగిపొర్లుతోంది. రాయలసీమ ప్రాంతంలో చిరు జల్లులు పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications