అసెంబ్లీ నుంచి బలరాం సస్పెన్షన్
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు కరణం బలరాం ఆరు నెలల పాటు శాసనసభ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన శాసనసభ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. కాంగ్రెస్ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి నేతృత్వంలోని సభా హక్కుల ఉల్లంఘన కమిటీ సమర్పించిన నివేదికను మంగళవారం శాసనసభ ఆమోదించింది. దీంతో కరణం బలరాం సస్పెన్షన్ కు గురయ్యారు.
కరణం బలరాం సస్పెన్షన్ ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శాసనభ్యులు స్పీకర్ ఛేంబర్ వద్ద ధర్నాకు దిగారు. కరణం బలరాంను సస్పెండ్ చేసిన అనంతరం స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సభను రేపటికి వాయిదా వేశారు. కరణం బలరాం సస్పెన్షన్ తో రేపు (బుధవారం) స్పీకర్ పై అభిశంసన తీర్మానం ప్రతిపాదించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది.












Click it and Unblock the Notifications