హంగ్ రాదు: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: రాష్ట్రంలో హంగ్ శాసనసభ వచ్చే అవకాశమే లేదని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. చిరంజీవితో ప్రత్యేక ఇంటర్వ్యూను తెలుగు ప్రైవేట్ చానెల్ ఎన్టీవీ మంగళవారం ప్రసారం చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్తెసరు మార్కులు వేసే సంప్రదాయం మన ఓటర్లకు లేదని ఆయన అన్నారు. పూర్తి మెజారిటీ అందించడమే మన ఓటర్లకు అలవాటని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెబుతున్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పని చేయదని ఆయన అన్నారు. అవకాశాలు రాని అణగారిన వర్గాలకు తన కరిష్మా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

రాజకీయాల్లోకి రావడం తనకు కొత్త అనుభూతి, ఇదో నూతన భావన అని, దీన్ని మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నానని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం తనకు అపూర్వ అవకాశమని ఆయన చెప్పారు. ఇటువంటి భావోద్వేగానికి తను ఇంతకు ముందు ఎప్పుడూ గురి కాలేదని ఆయన అన్నారు. అనిర్వచనీయమైన భావోద్వేగానికి గురవుతున్నానని ఆయన అన్నారు. తొలి దశలో భగత్సింగ్ వంటి దేశభక్తుల పాత్రలు పోషించాలని ఉండేదని, అయితే తాను పోషించిన పాత్రలు అంతుకు మించి ప్రజాదరణ పొందిన తర్వాత ఆ భావన తొలగిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+