యుద్ధంలో గెలుస్తాం: చిరంజీవి
తిరుపతి: యుద్ధంలో విజయం సాధించి తీరుతామని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి అన్నారు. మనం యుధ్ధ రంగంలో ఉన్నామని, యుద్ధం చేద్దామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు తమతో చేతులు కలుపుతారని ఆయన అన్నారు. తపన ఎక్కుపెట్టిన ఆయుధం చేద్దామని ఆయన అన్నారు. బురద చల్లి వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారని, ఎంత వెనక్కి లాగుతుంటే అంత ముందుకు సాగుదామని ఆయన అన్నారు. మీ కలలు సాకారం చేసుకోవడానికి నాకు కొత్త పాత్ర ఇచ్చారని, ఈ పాత్రను జీవితాంతం పోషించాలని ఆయన అన్నారు.
దర్శకులు, మార్గదర్శకులు ప్రజలేనని ఆయన అన్నారు. ఈ పాత్రలో నటించనని జీవిస్తానని ఆయన అన్నారు. అభివృద్ధిపైనే మన గురి ఉండాలని ఆయన అన్నారు. పేదరికమే శత్రువు అనిి ఆయన అన్నారు. జీవితాంతం ఈ పాత్రలో జీవించి ప్రజలకు సేవ చేస్తానని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరి అభివృద్దే తమ లక్ష్యమని ఆయన అన్నారు. భారతానికి సంతోషాంధ్ర ప్రదేశ్ ను, చిరునవ్వుల ఆంధ్రప్రదేశ్ ను చూద్దామని ఆయన అన్నారు. ఇదే సహకారం ప్రతి ఒక్కరూ అందించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications