అసెంబ్లీ ఆవరణలో బలరాం దీక్ష

హైదరాబాద్: ఆరు నెలల పాటు సస్పెన్షన్ కు గురైన తెలుగుదేశం శాసనసభ్యుడు కరణం బలరాం శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం దీక్షకు పూనుకున్నారు. జోరు వానలోనూ ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు. స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనను ఆరు నెలల పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.

కరణం బలరాంకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు సంఘీభావం తెలిపారు. బలరాంకు మద్దతుగా కొంత మంది తెలుగుదేశం నాయకులు కూడా దీక్షలో కూర్చున్నారు. తన సస్పెన్షన్ ఏకపక్షంగా జరిగిందని ఆయన విమర్శించారు. కరణం బలరాం సస్పెన్షన్ పై చర్చకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బుధవారం శాసనసభలో చర్చకు పట్టుబట్టారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+