సర్పంచులవి గొంతెమ్మ కోర్కెలు: జెసి
హైదరాబాద్: సర్పంచులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని, వాటిని తీర్చడం సాధ్యం కాదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు. సర్పంచులను తెలుగుదేశం పార్టీవారు రెచ్చగొడుతున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమస్యలేవైనా ఉంటే సర్పంచులు తమ వద్దకు మాట్లాడవచ్చునని ఆయన అన్నారు.
సర్పంచులు అనవసరంగా ఆందోళనకు దిగుతున్నారని, వారిని తెలుగుదేశం పార్టీవారు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 73, 74 నిబంధనల ప్రకారం కల్పించని అధికారాలను తాము ఏమైనా తగ్గించామా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications