కొలంబోలో బాంబు పేలుళ్ళు- 45 మందికి గాయాలు
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు జరిగిన శక్తిమంతమైన బాంబు పేలుడులో 45 మంది వ్యక్తులు గాయపడ్డారు. నగరంలో అత్యంత రద్దీగా వుండే ప్రాంతమైన పెట్టాన్‌లో ఓ దుకాణం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన పార్శిల్ పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఎల్‌టీటీఈ గెరిల్లా దళం వ్యక్తులు ఈ పేలుడుకు కారణం కావచ్చని పోలీసులు చెబుతున్నారు. గాయపడిన 45 మందిలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా వున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications