రైల్లో మంటలు...ప్రయాణీకుల్లో ఆందోళన
గూడూరు: చెన్నై నుంచి విజయవాడ వస్తున్న జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ లో ఈ రోజు ఉదయం మంటలు రేగటంతో ప్రయాణీకలు భయభాంత్రలకు గురయ్యారు. రైలు నెల్లూరు దాటగానే బీ5 బోగీలో మంటలు రేగాయి. మంటలు వచ్చిన విషయం గుర్తించి గూడూరులో రైలు ఆపివేశారు. పరిశీలన అనంతరం బేరింగులు అరిగి మంటలు వచ్చినట్లు గుర్తించారు. మంటలు రేగిన భోగీని విడదీసి ప్రయాణీకులను మోరో బోగీలోకి మార్చారు. అనంతరం రైలు తిరిగి బయిలు దేరింది.












Click it and Unblock the Notifications