అసోం వరదల వల్ల భారీ నష్టం
గౌహతి : అసోం రాష్ట్రాన్ని మంగళవారం కూడా వరదలు ముంచెత్తున్నాయి. ఈ వరదల ప్రభావం సుమారు పది లక్షల మంది ప్రజలపై పడివుంటుందని అంచనా. వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో పదిహేను మంది దుర్మరణం చెందారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆర్మీ సిబ్బంది కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు.
బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చడంతో రాష్ట్రంలోని మొత్తం 27 జిల్లాల్లో 16 జిల్లాలు వరదల బారినపడ్డాయి. పది లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్టు అంచనాలు ఉన్నాయి. మొత్తంమీద బాధిత ప్రాంతాల్లో వరద పరిస్థితి ఇప్పటికీ తీవ్రంగా ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 1346 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 2,69,609 హెక్టార్ల భూభాగం దెబ్బతింది.












Click it and Unblock the Notifications