ధర్నా: రైతు నాయకుల అరెస్టు
హైదరాబాద్: ఎరువుల కొరతపై అఖిల పక్ష రైతు నాయకులు బుధవారం రాజభవన్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతు నాయకులు అన్నారు. రామకృష్ణ, ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు నాయుకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులకు, రైతు నాయకులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.












Click it and Unblock the Notifications