ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం గణపతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు నిర్వహించారు. వాడవాడలా వివిధ రూపాల్లో గణేష విగ్రహాలను నెలకొల్పారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో పెద్ద యెత్తున ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. శ్రీశైలంలోనూ పెద్దయెత్తున ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాదులో వేయికి మించి గణేష విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వినాయకుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా వినాయక విగ్రహాన్ని నెలకొల్పి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కె. ఎర్రంనాయుడు, హరికృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ప్రజారాజ్యం నేత చిరంజీవి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications