ఏచూరితో మిత్రా భేటీ: ముందస్తు జాగ్రత్త
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో సిపిఎం ఎక్కడ అవగాహనకు వస్తుందో అనే భయం చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో ఉన్నట్లుంది. అందుకే సిపిఎంను తమ వైపు ప్పుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ తొందరపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం నేపథ్యంలో సిపిఎం అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా ఆ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన బుధవారం సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు.
గతంలో కూడా మిత్రా సిపిఎం, సిపిఐ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు బి.వి. రాఘవులు, కె. నారాయణలతో ఆయన చర్చలు జరిపారు. ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడిన సిపిఎంను తన వైపు తిప్పుకోవడానికి ఆయన రాఘవులును కలిశారు. సిపిఐ కార్యదర్శి కె. నారాయణతో ఫోన్ లో మాట్లాడారు. సిపిఐ తమకు అనుకూలంగా సంకేతాలు పంపుతున్నప్పటికీ సిపిఎం మాత్రం తన వైఖరిని స్పష్టం చేయడంలేదు. పైగా తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సిపిఎంను తమకు అనుకూలం చేసుకోవడానికి మిత్రా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications