చిరు రాజకీయాల్లోనూ మెగానే: జయప్రద
హైదరాబాద్: రాజకీయాల్లోనూ చిరంజీవి మెగాస్టారేనని సినీ నటి, సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద అన్నారు. తమ పార్టీ నేత అమర్ సింగ్ తో కలిసి ఆమె చిరంజీవిని కలిసేందుకు ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. రాష్ట్రంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విజయానికి తాము కృషి చేస్తామని ఆమె చెప్పారు. ప్రజారాజ్యంపై పొత్తు విషయంలో తుది నిర్ణయం అమర్ సింగ్ దేనని ఆమె అన్నారు.
ప్రజారాజ్యం పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని, తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నుంచే పోటీ చేస్తారని అమర్ సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications
