చిరుతో అమర్ భేటీపై దాసరి ఆరా

అమర్ సింగ్ తో పాటు ఎస్పీ రాజ్యసభ సభ్యులు జయప్రద, జయాబచ్చన్ ఆదివారం సాయంత్రం చిరంజీవిని కలిశారు. చిరంజీవిని కలిసిన అనంతరం వారు దాసరి నారాయణరావును కూడా కలవాలనుకున్నారు. అయితే దాసరి నారాయణరావు మేస్త్రీ చిత్ర నిర్మాణంలో తీరిక లేకుండా ఉండడంతో వీలు కాలేదు. నెలాఖరులో మళ్లీ హైదరాబాద్ వస్తామని, అప్పుడు కలుస్తామని అమర్ సింగ్ దాసరితో చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగులో దాసరి నారాయణరావు తీసిన ఒసేయ్ రాములమ్మ చిత్రం బెంగాలీ వెర్షన్ షూటింగ్ ఈ నెలాఖరులో హైదరాబాదులో జరుగుతోంది. ఈ సినిమాలో నటిస్తున్న అమర్ సింగ్, జయప్రద షూటింగ్ నిమిత్తం హైదరాబాదు రానున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
