ఇస్లామాబాద్: పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) అధ్యక్షుడు అసిఫ్ జర్దారీ మంగళవారంనాడు దశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం జరిగిన ఎన్నికల్లో ఆయన పాక్ అధ్యక్షుడు భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. అధ్యక్ష భవనానికి ఆయన తన మకాం సోమవారంనాడే మార్చారు. కాగా, జర్దారీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిఎంఎల్ (ఎన్) చీఫ్ నవాజ్ షరీఫ్ హాజరు కాలేదు. జర్దారీ చేత ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ హమీద్ దోగార్ ప్రమాణం చేయించారు.