స్పీకర్ తక్షణం వైదొలగాల్సిందే : టిడిపి

ఈ సమయంలో డిప్యుటీ స్పీకర్ కుతూహలమ్మ జోక్యం చేసుకుని - స్పీకర్ విధి నిర్వహణ గురించి మాట్లాడాలి తప్పఇతర విషయాలు మాట్లాడరాదని అన్నారు. తాము స్పీకర్ సురేష్‌రెడ్డిని విమర్శించటం లేదని సురేష్ రెడ్డి ఎంతో మంచి వ్యక్తి అని తెలుగుదేశం సభ్యుడు చెన్నమనేని రాజేశ్వరరావు అన్నారు. దీంతో రోశయ్య జోక్యం చేసుకుని - అలా అయితే ఈ అవిశ్వాసం ఎందుకని ప్రశ్నించారు. తాము వ్యక్తిగా సురేష్‌రెడ్డిని విమర్శించటం లేదని, స్పీకర్‌గా ఆయన వ్యవహార శైలిని తప్పు పడుతున్నామని రాజేశ్వరరావు అన్నారు. స్పీకర్ పాలకపక్షం కొమ్ము కాస్తూ స్పీకర్ పదవికి మచ్చ తెస్తున్నారని, తక్షణం ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నాగం జనార్థనరెడ్డి డిమాండ్ చేశారు. నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో పలు సందర్భాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది.












Click it and Unblock the Notifications