అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ ప్రదర్శన
హైదరాబాద్: స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తెలుగుదేశం పార్టీకి జ్ఞానోదయం కలగాలని కోరుకుంటూ కాంగ్రెస్ శాసనసభ్యులు మంగళవారం శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శనకు దిగారు. సురేష్ రెడ్డిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం సోమవారం శాసనసభలో వీగిపోయిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఇందులో భాగంగానే ఆ పార్టీలు స్పీకరుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయని కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎర్రాసు ప్రతాపరెడ్డి విమర్శించారు.
ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని సాకుగా తీసుకున్నాయని ఆయన అన్నారు. శాసనసభా సమయాన్ని వృధా చేశారని ఆయన విమర్శించారు. మాట్లాడిందే మాట్లాడి, చివరికి ఏమీ లేక సభాధ్యక్షురాలిని ఘెరావ్ చేశారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యం మీద గానీ, శాసనసభ మీద గానీ నమ్మకం పోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications