ట్యాంక్ బండ్ పై విపక్షాలు ధర్నా
హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు మంగళవారం ఒక తాటి మీదికి వచ్చాయి. ప్రతిపక్షాల శాసనసభ్యులు ట్యాంక్ బండ్ పై గల అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. స్పీకరుపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం శాసనసభలో ప్రభుత్వ తీరును ప్రతిపక్షాలు విమర్శించారు. స్పీకరును ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం కూడా నియంత్రించారని ప్రతిపక్షాల నాయకులు విమర్శించారు.
స్పీకరుపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరపకుండా మూజూవాణీ ఓటుతో తీర్మానం వీగిపోయిందంటూ సభను ఆర్థాంతరంగా వాయిదా వేశారని ప్రతిపక్షాల నాయకులు విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజాసమస్యలపై పట్టి లేదని వారు విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వం వ్యవహరించడం లేదని వారు విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. ఈ ధర్నాలో నారా చంద్రబాబునాయుడితో పాటు నోముల నర్సింహయ్య, చాడ వెంకటరెడ్డి, ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాల ధర్నాతో ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.












Click it and Unblock the Notifications