సౌమ్య హత్య కేసు : ఎఎఫ్ బి దర్యాప్తు
హైదరాబాద్ : అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో అనుమానస్పద పరిస్థితుల్లో హత్యకు గురైన సౌమ్య హత్యకేసు దర్యాప్తునకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. సౌమ్య మృతదేహం మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లోని లభ్యమవడం తెలిసిందే. దక్షిణ ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సౌమ్య హత్యకు గురైంది.
సౌమ్య హత్యతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ మంగళవారం పరామర్శించారు. సౌమ్య మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నట్టు షికాగోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.












Click it and Unblock the Notifications