సౌమ్య హత్య: విక్రంరెడ్డిపై ఆరా
హైదరాబాద్: అమెరికాలో సౌమ్యారెడ్డి హత్య మిస్టరీగా మారింది. నల్లజాతీయులు ఆమెను హత్య చేసి పారిపోయారని ఇక్కడికి సమాచారం అందింది. అయితే పరిస్థితులు మరో రకంగా కనిపిస్తున్నాయి. సౌమ్య హత్య జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన విక్రంరెడ్డిపై అనుమానాలు పెరుగుతున్నాయి. సౌమ్య హత్య కేసు మిస్టరీని విడదీయడానికి అమెరికాలోని ఎఫ్ బిఐ రంగంలోకి దిగింది.
పార్కులో నిలిపి ఉన్న కారులో సౌమ్య మృతదేహం కనిపించింది. ఆ కారు గురించి ఆరా తీయగా అది విక్రంరెడ్డి పేర రిజిష్టర్ అయి ఉన్నట్లు తేలింది.దీంతో విక్రంరెడ్డి ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. విక్రంరెడ్డికి, సౌమ్యకు ఏమిటి అనే విషయంపై కూడా దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications